రూ. 6 లక్షల సొత్తు స్వాధీనం
NEWS Feb 15,2025 12:36 pm
మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు, వారికి సహకరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేశ్, సాయికుమార్తో పాటు చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేస్తున్న అబ్దుల్ బారిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.6 లక్షల విలువగల 30 వ్యవసాయ కరెంటు మోటార్లు, 30 కిలోల కాపర్ వైర్, ఒక బైక్, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు SP అశోక్ కుమార్ .