ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల ఫైర్
NEWS Feb 15,2025 09:07 am
మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. జగన్ హయాంలో విశాఖ రుషికొండ ప్యాలెస్ ను భారీ ఖర్చుతో నిర్మించారు. దీనిపై విచారణకు ఆదేశించింది కూటమి సర్కార్. ఈ తరుణంలో కాంట్రాక్టర్ కు ఆర్థిక శాఖ బిల్లులు క్లియరెన్స్ చేసిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలా బిల్లులు చెల్లించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు చెల్లించ లేదని, అదే సంస్థ వేరే పనులు చేపట్టిన పనులకు సంబంధించి మంజూరు చేశామన్నారు.