శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు
NEWS Feb 15,2025 05:59 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 64 వేల 527 మంది దర్శించుకున్నారు. 23 వేల 129 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.