కేసీఆర్ దగ్గర లారీల కొద్దీ డబ్బులు
NEWS Feb 14,2025 12:46 pm
సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద లారీల కొద్దీ డబ్బులు ఉన్నాయన్నారు. డబ్బులతో ఓట్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారని, కానీ వారి ఆటలు గత ఎన్నికల్లో సాగలేదని అన్నారు. కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుడు దగ్గర లెక్కకు మించి నోట్ల కట్టలు మూలుగుతున్నాయని ఆరోపించారు. కామారెడ్డిలో కేసీఆర్ ను బండకేసి కొట్టారంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ డబ్బులతో గెలుస్తామని అనుకుంటే తప్పన్నారు. ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తామన్నారు.