సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పీఎం మోడీపై నిప్పులు చెరిగారు. తను పుట్టుకతో బీసీ కాదన్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ అయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 2001 వరకు ఆయన ఉన్నత వర్గాలకు చెందిన వాడన్నారు. తను ప్రధాని అయ్యాక తన కులాన్ని బీసీ కులంలో కలుపుకున్నాడని మండిపడ్డారు. ఆయనకు బీసీ సర్టిఫికెట్ ఉండొచ్చని కానీ తన మనస్తత్వం పూర్తిగా బీసీలకు వ్యతిరేకం అన్నారు. నిజంగా బీసీ అయితే జనాభా లెక్కలు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు.