కూటమి సర్కార్ పై జగన్ కన్నెర్ర
NEWS Feb 14,2025 11:54 am
టీడీపీ కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్ . తమ పార్టీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ పార్టీ నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.