హైదరాబాద్ లో కుళ్లిన చికెన్ సీజ్
NEWS Feb 14,2025 07:06 am
బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండడంతో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రసూల్ పురా అన్నానగర్ లో చికెన్ షాపులతో దాడులు చేశారు. తనిఖీలలో భారీగా పట్టుబడింది కుళ్లిన చికెన్. దాదాపు 5 క్వింటాళ్లకు పైగా చికెన్ ను సీజ్ చేశారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వద్ద తక్కువ ధరకు వీటిని అమ్ముతున్నట్లు గుర్తించారు. కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్ లో మూడు నెలల పాటు నిల్వ ఉంచుతున్నట్లు తేలింది. ప్రభుత్వం కొంత కాలం పాటు చికెన్ తినవద్దని హెచ్చరించింది.