ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి మృతి
NEWS Feb 14,2025 01:42 pm
తాడ్వాయి (మం) మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా బంజరు పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగడ్డకు చెందిన డ్యాగల సారయ్య (55) అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. నిన్న తన యజమాని కుటుంబంతో కలిసి మేడారం జాతరకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో చింతల్ సమీపంలో ట్రాక్టర్ పై నుండి అదుపుతప్పి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ములుగు మార్చురీకి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.