19న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
NEWS Feb 14,2025 04:58 am
బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈనెల 19న హైదరాబాద్ లో జరగనున్నాయి. పార్టీ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. ఈ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, తదితర నిర్మాణాత్మక అంశాలపై చర్చిస్తారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్ లో జంప్ అయిన ఎమ్మెల్యేల అంశంపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారని పార్టీ పేర్కొంది.