వంశీ లీడర్ కాదు పొలిటికల్ బ్రోకర్
NEWS Feb 14,2025 04:05 am
మంత్రి వాసంశెట్టి సుభాష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మండిపడ్డారు. తను లీడర్ కాదని పొలిటికల్ బ్రోకర్ అన్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ అండ చూసుకుని రెచ్చి పోయాడని, కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. వంశీ చేసిన అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం లేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఇది శాంపిల్ మాత్రమేనని ఇంకా చాలా మంది ఉన్నారన్నారు.