కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు సంవత్సరాలుగా మణిపూర్ లో రెండు జాతుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో విఫలమైంది బీజేపీ సర్కార్. చివరకు గత్యంతరం లేక సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రిజైన్ ను గవర్నర్ ఆమోదించారు.