పర్యాటకరంగ అభివృద్దికి ప్రయారిటీ
NEWS Feb 13,2025 10:10 am
పర్యాటక రంగానికి ఏపీని కేరాఫ్ గా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు. పర్యాటక శాఖపై సమీక్ష చేపట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి దృష్టి సారించాలన్నారు. త్వరలో తయారు చేసే బడ్జెట్ లో టూరిజం రంగానికి సంబంధించి ఎక్కువ నిధులు వచ్చేలా ప్లాన్ తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎండీ ఆమ్రపాలి కాట, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు.