శ్రీవారి సన్నిధిలో సాయి పల్లవి..చైతన్య
NEWS Feb 13,2025 06:30 am
తిరుమల శ్రీవారిని తండేల్ మూవీ టీం దర్శించుకుంది. ఈనెల 7న విడుదలైన ఈ చిత్రం భారీ సక్సెస్ సాధించింది. 7 రోజుల్లోనే రూ. 80 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. భారీ విజయం అందించినందుకు ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు సాయి పల్లవి, నాగ చైతన్య, అల్లు అరవింద్, చందు మొండేటి. సినిమా విడుదలకు ముందు స్వామి వారిని మొక్కుకున్నామని, ఆశించిన దానికంటే ఆదరించినందుకు గాను ఇవాళ దర్శించుకున్నామన్నారు.