వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
NEWS Feb 13,2025 05:02 am
తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్య తీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. భక్తులకు పాప వినాశనం డ్యామ్ వద్ద పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.