తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి, అమ్మ వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.