నిర్దేశించిన సమయానికి భక్తులు రావాలి
NEWS Feb 13,2025 04:20 am
టీటీడీ ఈవో జె. శ్యామల రావు సంచలన ప్రకటన చేశారు. తిరుమల పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. నిర్దేశించిన సమయాని కంటే ముందే భక్తులు దర్శనం కోసం వస్తున్నారని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి రావాలని, టీటీడీకి సహకరించాలని కోరారు ఈవో.