టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో అంగరంగ వైభవోపేతంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. టీటీడీ ఈవో జె. శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో కంటే మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించారంటూ భక్తులు ప్రశంసలు కురిపించారు.