తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 70 వేల 270 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 175 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు స్వామి వారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.