మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
NEWS Feb 13,2025 03:26 am
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న తనను అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ సెక్షన్
140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. తనను గచ్చిబౌలి నుంచి భారీ భద్రత మధ్య బెజవాడకు తరలించారు. వంశీ ఇంటికి నోటీసులు అంటించారు. కాగా నగరంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.