పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ల మధ్య మాటల యుద్దం మరింత పెరిగింది. గవర్నర్ ను తొలగించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. తనను కించ పరిచేలా మాట్లాడారంటూ, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ గవర్నర్ సీఎంపై రూ. 11 పరువు నష్టం దావా వేశారు. దేశంలోనే తొలిసారిగా ఓ గవర్నర్ ముఖ్యమంత్రిపై దావా వేయడం. తనను కావాలని కేంద్రం ఇరుకున పెట్టాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు దీదీ.