కమెడియన్ పృథ్వీ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2029లో తనను భూమి మీద లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. రాత్రి సమయంలో తన ఇంటి ముందు రెండు మూడు కార్లు తిరుగుతున్నాయని అన్నారు. నా నెంబర్ ఎక్స్ లో పెట్టిన వారిపై రూ. కోటి పరువు నష్టం దావా వేశానని చెప్పారు. తన తల్లి గురించి కొందరు వెధవలు చులకనగా మాట్లాడారని ఆవేదన చెందారు. అందుకే తనకు హై బీపీ వచ్చిందన్నారు. ప్రస్తుతం కంట్రోల్ లో ఉందన్నారు.