ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తనకు రూం ఇవ్వలేదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. రాత్రి ఢిల్లీకి కేంద్ర మంత్రిని కలిసేందుకు వచ్చానని, గది కావాలని అడిగితే సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. రూం లేదని ప్రైవేట్ హోటల్ కు వెళ్లాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. తనకు జరిగిన అవమానంపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. తెలంగాణ భవన్ లో మాఫియా ఉందన్నారు. రూంల కేటాయింపుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.