మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో మద్యం ధరలు పెంచితే రాద్దాంతం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఒక్కో బీరుకు రూ. 30 నుంచి రూ. 40కి పెంచారని ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మందు అమ్మి పాలన సాగిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన వాళ్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల కిందట బూం బూం బిర్యానీ బీర్ అంటూ ఎద్దేవా చేశారని ఇప్పుడేమంటారంటూ సెటైర్ వేశారు.