డిప్యూటీ సీఎం దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. బీజేపీ ప్రచారం కోసం తాను కేరళ, తమిళనాడులో పర్యటించడం లేదన్నారు. కేవలం ఆలయాలను సందర్శిస్తున్నానని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నాలుగున్నర ఏళ్ల కిందట మొక్కుకున్నానని అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీ నిజంగా దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.