ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ పైరసీని ప్రోత్సహించదని ప్రకటించారు. తండేల్ సినిమా పైరసీ ప్రింట్ టెలికాస్ట్ చేసిన బస్సును సర్వీను నుంచి తొలగించామని వెల్లడించారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక నుంచి బస్సులలో అనుమతి పొందిన సినిమాలను మాత్రమే టెలికాస్ట్ చేస్తారన్నారు.