విజయవాడ సితార సెంటర్ లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై స్పందించారు మంత్రి వంగలపూడి అనిత. ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా అని ఆరా తీశారు. గ్యాస్ సిలిండర్ పేలుడుతో మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అదుపులోకి తీసుకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు మంత్రి. వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావుతో ఫోన్ లో మాట్లాడారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందన్నారు.