యూపీ అయోధ్యలోని రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. ఆచార్య దాస్ కు ఛాతిలో నొప్పి రావడంతో లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు. సీనియర్ వైద్యులు ప్రయత్నం చేసినా ఫలితం లేక పోవడంతో ఇవాళ మృతి చెందారు. ఆయన లోకాన్ని వీడడం పట్ల విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంఎస్ దాస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.