చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర రాజన్ , ప్రధాన పూజారి రంగరాజన్ లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు నటి కరాటే కళ్యాణి. ఇది స్వామిపై జరిగిన దాడి కాదని యావత్ హిందువులపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని లేదంటే హిందువుల తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ తో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.