కమెడియన్ పృథ్వీరాజ్ భార్య షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త ఎందుకు సారీ చెప్పాలని ప్రశ్నించింది. సినిమాలో గొర్రెలు ఉన్నాయో లేదో అన్నది తెలియదంటూ ఎద్దేవా చేసింది. డైరెక్టర్ ఏం చెబితే అది మాత్రమే చేశాడని చెప్పింది. కామెడీ ఆర్టిస్ట్ గా తన భర్త పృథ్వీ రాజ్ కామెంట్స్ చేశాడని , అంత మాత్రానికే ట్రోల్ చేస్తారా అంటూ మండిపడింది. ఎవరినీ టార్గెట్ చేయలేదని పేర్కొంది. అయినా నేతలు ఏమైనా గొర్రెలా అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.