ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో చికెన్ అమ్మకాలు చేపట్టవద్దని కోరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ సరిహద్దుల్లోకి కోళ్లు వస్తుండడంతో వాటిని వెనక్కి పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో 24 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వస్తున్న కోళ్ల వాహనాలను తిప్పి పంపించారు.