సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. గిరిజనులు చేపట్టిన ఆందోళన విరమించాలని కోరారు. వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. 1/70 చట్టాన్ని రద్దు చేసే ఆలోచన లేదని అన్నారు. గిరిజనుల అస్తిత్వం కాపాడు కోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడు కోవడమేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జీవో రద్దయిందని, తిరిగి జీవో తీసుకు వస్తామన్నారు.