మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. వారిపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఉప ఎన్నికలు జరగడం ఖాయమని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఓడి పోతాడని, రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లతో పాటు పలువురు నేతలు చేరారు. కేసీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.