బీజేపీ హైకమాండ్ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెర దించింది. అందరూ ఊహించినట్లుగానే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరును ఖరారు చేసింది. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ గతంలో సీఎంగా పని చేశారు. పర్వేశ్ వర్మ ఒకప్పుడు జర్నలిస్ట్ గా పని చేశారు. ఆయన రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తో కూడిన కమిటీ వర్మను ఏకగ్రీవంగా సీఎంగా సిఫార్సు చేసింది.