కాసిపేట మండలం కోనూరు గ్రామంకు చెందిన అంకతి రాజయ్య పెరట్లో పెట్టిన విద్యుత్ వైర్లు తగిలి అంకతి మల్లయ్య మృతి చెందాడు.మల్లయ్య మృతికి అంకతి రాజయ్య కారణమంటూ మృతదేహంతో ఇంటి ముందు బైఠాయించి నష్టపరిహారం చెల్లించాలంటూ అంకతి మల్లయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.దేవాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతికి కారణమైన వ్యక్తి ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.