స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మదుపరులకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఏకంగా రూ . 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరై పోయింది. 1,018 పాయింట్ల నష్టంతో 76,293 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. 309 పాయింట్ల నష్టంతో 23,071 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయ్యింది. ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలతో భారీ నష్టాలు చవి చూశాయి. ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు.