టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి కేటీఆర్ పై భగ్గుమన్నారు. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చెల్లెలు కవిత, బావ హరీశ్ రావు ఇచ్చిన షాక్ తట్టుకోలేక మతిభ్రమించి మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంపై చర్చకు సిద్దమా అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.