లైలా మూవీ ప్రీ ఈవెంట్ లో షాకింగ్ కామెంట్స్ చేసి చర్చనీయాంశంగా మారిన నటుడు పృథ్వీ రాజ్ ఆస్పత్రి పాలయ్యారు. ఆయనకు బీపీ పెరగడంతో కుటుంబీకులు హుటా హుటిన హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ లోనే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మూవీ కార్యక్రమంలో సదరు నేతలను మేకలతో పోల్చాడు. దీంతో బాయ్ కాట్ లైలా ట్రెండింగ్ లో కొనసాగుతోంది.