ఎంపీ సీఎం రమేశ్ పార్లమెంట్ వేదికగా నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే పది రెట్లు ఎక్కువ ఏపీలో మద్యం కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపించారు. జీరో అవర్ లో ఆయన ఈ అంశం గురించి ప్రస్తావించారు. కేవలం నగదు రూపంలోనే మద్యం అమ్మకాలు జరిగాయని, వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం రమేష్ మాట్లాడుతుండగా వైపీపీ ఎంపీ మిధున్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి స్కామ్ పై ఎందుకు చంద్రబాబు నోరు విప్పడం లేదంటూ ప్రశ్నించారు.