సమర్థ నాయకత్వం ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మంత్రుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఇప్పటికే పనితీరుపై ర్యాంకులను ఇవ్వడం జరిగిందన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి ఎక్కువగా దృష్టి సారించాలని అన్నారు. లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిత్యం ఆయా శాఖలలో ఏం జరుగుతుందనే విషయంపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో ఉండాలని ఆదేశించారు సీఎం.