ఫ్రాన్స్ లో మోడీకి గ్రాండ్ వెల్ కమ్
NEWS Feb 11,2025 04:55 am
విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని మోడీ. ఏఐ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ కు చేరుకున్నారు. పీఎంకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పీఎంను కలిసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ మోడీకి సాదర స్వాగతం పలికారు. పీఎంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం, టెక్నాలజీ, వ్యాపార, వాణిజ్య రంగాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు.