సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రజలను తప్పుదారి పట్టించే వైద్య ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి వెంటనే వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ , జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 7వ తేదీన విచారణకు వర్చువల్ గా హాజరు కావాలని స్పష్టం చేసింది. వైద్య ప్రకటనలపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది .