తన జీవితమంతా పోరాడటంతోనే సరి పోయిందన్నారు సీఎం మమతా బెనర్జీ. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవాలను తెలియ చేయాలనే ఉద్దేశంతోనే పుస్తకాలు రాశానని అన్నారు. బుక్ ఎగ్జిబిషన్ లో తాను రాసిన మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. తనను పుస్తకాలు ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. ఆడంబరాలు, భేషజాలకు పోనని, అత్యంత సాధారణంగా ఉండేందుకు ఇష్ట పడతానని అన్నారు. తనకు నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే పుస్తకాలేనని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.