ప్రభుత్వం మద్యం బాబులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ధరల పెంపుపై ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్డి జైస్వాల్ నేతృత్వంలోని కమిటీ ధరలు పెంచాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు నివేదిక సమర్పించింది ప్రభుత్వానికి. కమిటీ సూచనల మేరకు 15 శాతం ధర పెంచుతూ నిర్ణయించింది. మంగళవారం నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో బావురుమంటున్నారు మద్యం ప్రియులు.