ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున కోళ్లు చని పోతుండడంతో చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్ లను ఏర్పాటు చేసింది. వైరస్ చని పోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్దారించారు. పూణె ల్యాబ్ లో పరీక్షించారు. రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కోళ్ల అమ్మకాలపై నిషేధం విధించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే 95429 08025 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు కలెక్టర్.