యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళా ఆధ్యాత్మిక మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ. 42 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని వెల్లడించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఈ సంఖ్య యుఎస్ జనాభా 331 మిలియన్లు, కెనడా 38 మిలియన్ల జనాభాను మించి పోయిందని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.