తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 70 వేల 169 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 559 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.33 కోట్లు వచ్చిందని వెల్లడించారు ఏవో శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.