12 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ టూర్
NEWS Feb 10,2025 03:34 pm
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.