పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తులు ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మాలి కులస్తులకు ఎస్టీ హోదా కల్పించాలని కోరారు. అంతేగాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలి కులస్తులకు టికెట్లు కేటాయించాలని, హైదరాబాదులో మాలి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని విన్నవించారు. దీనికి భట్టి సానుకూలంగా స్పందించారు.