మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పట్నం నరేందర్ రెడ్డికి 50 వేల ఓట్ల కంటే తక్కువ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. కోస్గిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రైతులను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత ఈ సర్కార్ కు దక్కుతుందన్నారు.