చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడిన ఘటన గురించి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రంగరాజన్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు.